చంద్రగిరి మండలంలోని మోహన్ బాబు యూనివర్సిటీలో బీటెక్ చివరి సంవత్సరం విద్యార్థి హర్షవర్ధన్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఇటీవల కాలంలో ఈ యూనివర్సిటీలో జరిగిన రెండో ఆత్మహత్య కావడంతో తీవ్ర కలకలం రేగుతోంది.
కడప జిల్లా బాలాపల్లికి చెందిన హర్షవర్ధన్ రెడ్డి, రామిరెడ్డిపల్లిలో రూము అద్దెకు తీసుకుని యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. గురువారం తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఇటీవల ఇదే యూనివర్సిటీకి చెందిన మరో విద్యార్థిని కూడా ఆత్మహత్య చేసుకోవడంతో, ఈ ఘటనలు విద్యార్థి వర్గాల్లో, తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.












