సంగారెడ్డి, 2026-08-05
నేటి డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు ప్రజలకు అతిపెద్ద సవాళ్లుగా మారాయని, వీటిపై అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి సూచించారు. సంగారెడ్డిలోని సెయింట్ ఆంథోనీ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన సైబర్ అవగాహన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సి.వి. ఆనంద్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో () డైరెక్టర్ షికా గోయల్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు నెలరోజుల పాటు సురక్షా కా తిరంగా సైబర్ స్వతంత్ర తెలంగాణ పేరుతో సైబర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. ఆగస్టు నెల తొలి బుధవారం నిర్వహించే జాతీయ సైబర్ జాగ్రూకత దివస్ సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని సెయింట్ ఆంథోనీ డిగ్రీ కళాశాలలో ఈ కార్యక్రమం నిర్వహించారు.












