తమను పరీక్షలో ఉత్తీర్ణులను చేయాలని కోరుతూ ఒక ఇంటర్ విద్యార్థి రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తల్లిదండ్రులు లేని తనను పాస్ చేయాలని, గురువులే తన దైవమని విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు.
అచ్చంపేట పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. పరీక్షలో తాను చదివిన ప్రశ్నలు రాలేదని, కాబట్టి తనను పాస్ చేయాలని విద్యార్థి తన ఆన్సర్ షీట్లో పేర్కొన్నాడు. 'నాకు అమ్మానాన్న లేరు. నా దేవుడు మీరే సర్. నన్ను పాస్ చేయండి' అని రాసుకొచ్చాడు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ లేఖతో పాటు, తాను ఉపాధ్యాయుడి కాళ్లు పట్టుకుంటున్నట్లుగా ఒక చిత్రాన్ని కూడా విద్యార్థి గీశాడు. ఈ అనూహ్య పరిణామం ఉపాధ్యాయుడిని దిగ్భ్రాంతికి గురిచేసింది.











