ప్రముఖ నటుడు సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న క్రైమ్ కామెడీ చిత్రం సీన్ ట్రైలర్ విడుదలైంది. ఆవేశం ఫేమ్ దర్శకుడు జీతు మాధవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సూర్య గత చిత్రాలకు భిన్నంగా, విధులపై పెద్దగా ఆసక్తి లేని పోలీస్ అధికారిగా కనిపించనున్నారు.
ట్రైలర్లో సూర్య డీఎస్పీ ఇన్బరాజ్ పాత్రలో కనిపించారు. పోలీస్ శాఖకు రాజీనామా చేసి ఇంట్లో హాయిగా గడుపుతున్న ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకురావడానికి తోటి పోలీసులు ప్రయత్నిస్తుంటారు. అయితే ఇన్బరాజ్ మాత్రం వారి మాటలను పట్టించుకోకుండా సరదాగా గడుపుతుంటారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
చివరకు పోలీసులు ఆయన్ని బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాల్సి వస్తుంది. కెరీర్లో ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు ఎందుకు రాజీనామా చేశావని ఉన్నతాధికారి ప్రశ్నించగా, రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్నట్లు ఇన్బరాజ్ చెప్పడం ట్రైలర్లో ఆసక్తికరంగా నిలిచింది.












