భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రాల్లో ఒకటిగా ప్రచారం పొందుతున్న రామాయణం తొలి భాగం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతాదేవిగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు.
ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా చిత్రంలోని విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్స్, యుద్ధ సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని అంతర్జాతీయ స్థాయి సాంకేతికతతో తెరకెక్కించేందుకు చిత్రబృందం ప్రయత్నించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ సంగీతాన్ని అందిస్తుండగా, నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. రెండో భాగం 2028లో విడుదలయ్యే అవకాశముందని నిర్మాత ఇప్పటికే వెల్లడించారు.
విడుదలకు ముందే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్‌లో భారీ స్పందన లభించినట్లు సినీ వర్గాలు తెలిపాయి. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి

