నటుడు-నిర్మాత విశాల్‌కు మద్రాస్ హైకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. లైకా ప్రొడక్షన్స్ కేసులో భాగంగా ₹10 కోట్లు డిపాజిట్ చేయడానికి గడువు పొడిగించాలన్న ఆయన అభ్యర్థనను హైకోర్టు మంగళవారం తోసిపుచ్చింది.
లైకా ప్రొడక్షన్స్ సంస్థకు చెల్లించాల్సిన ₹57 కోట్ల మొత్తంలో భాగంగా, 2019లో విశాల్ తీసుకున్న ₹21.29 కోట్ల రుణానికి 30% వడ్డీతో కలిపి చెల్లించాలని సింగిల్ జడ్జి గతంలో ఆదేశించారు. ఈ ఆదేశాలపై స్టే విధించడానికి కోర్టు ₹10 కోట్లు డిపాజిట్ చేయాలని షరతు విధించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అయితే, ఈ ₹10 కోట్లను డిపాజిట్ చేయడానికి అవసరమైన సమయం సరిపోవడం లేదని, కాబట్టి గడువును పొడిగించాలని కోరుతూ విశాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం, గడువు పొడిగింపునకు నిరాకరించింది.











