మండలం వన్నెల్ బి గ్రామ పంచాయతీ ఆవరణలో పోషణ మాసం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వినోద ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సాంప్రదాయబద్ధంగా సీమంతాలు, పిల్లలకు అన్నప్రసన నిర్వహించారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని సూచించారు.
మండలం వన్నెల్ బి గ్రామ పంచాయతీ ఆవరణలో పోషణ మాసం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ వినోద, గ్రామ పంచాయతీ వార్డ్ సభ్యులు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సాంప్రదాయబద్ధంగా సీమంతాలు, పిల్లలకు అన్నప్రసన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల టీచర్ సోనీ మాట్లాడుతూ, చిన్నారులు, గర్భిణీ స్త్రీలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అనంతరం అంగన్వాడీ టీచర్ శారదా, రాణి మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం పట్ల మరియు వారు తీసుకోవాల్సిన పోషకాహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. అంగన్వాడీ కేంద్రం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను, పౌష్టికాహారాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అవగాహన కల్పించారు. అలాగే వార్డ్ సభ్యులు మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న పోషక పదార్థాలు అంగన్వాడీ కేంద్రాలలో పంపిణీ చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. వీటిని సక్రమంగా వినియోగించుకుని గర్భవతులు, బాలింతలు, అంగన్వాడీ విద్యార్థిని విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న పోషక పదార్థాలను వినియోగించుకోవాలని సూచించారు.












