ప్రపంచ దంత ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జె.పి. నడ్డా ప్రజలు తమ నోటి పరిశుభ్రత విషయంలో మెరుగైన అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా ద్వారా పలు సూచనలు చేశారు.
శ్రీ నడ్డా తన సోషల్ మీడియా పోస్టులో, ప్రతిరోజూ సరిగ్గా బ్రష్ చేసుకోవడం, చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలను తగ్గించడం, క్రమం తప్పకుండా దంత వైద్యుడిని సంప్రదించడం వంటి సాధారణ పద్ధతులు ఆరోగ్యకరమైన చిరునవ్వుకు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కుటుంబ సభ్యులందరూ కలిసి మంచి నోటి ఆరోగ్య అలవాట్లను పెంపొందించుకోవాలని ఆయన ప్రోత్సహించారు. నోటి ఆరోగ్యం బాగుంటేనే మొత్తం ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని, ఇది కేవలం అందమైన చిరునవ్వుకే పరిమితం కాదని మంత్రి వివరించారు.











