కామారెడ్డి, 2026-06-08
మచరెడడ ఘ పూర కు చెంద బురర సరవంత అే 7 ె గరభణీక అక పరసవం జరగంద. జమంచ మగ శశువుకు తీవర శవసకశ సమసు తెతతడంత, అత కమరెడడ ుండ హైదరబద ీఫర ఆసుపతరలింపుక తరలింపుంచరు.
మాచారెడ్డి ఘన్ పూర్ కు చెందిన బుర్ర స్రవంతి, రెండవ కాన్పునకు 7 నెలల గర్భిణీగా ఉండగా, గత నెల 8వ తేదీన కడుపు నొప్పితో కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చింది. అక్కడ సాధారణ కాన్పులో మగ శిశువు జన్మించాడు. అయితే, శిశువు బరువు 1.4 కిలోలు ఉండి, శ్వాస ఇబ్బందితో బాధపడటంతో, ఆసుపత్రిలో 12 రోజులు ఉంచి, కొద్దిగా మెరుగుపడటంతో ఇంటికి పంపించారు.
పరిస్థితి విషమం
ఈరోజు బాబుకు శ్వాస ఇబ్బంది, పాలు తీసుకోకపోవడం, ఏడవకపోవడం వంటి లక్షణాలు కనిపించడంతో మళ్లీ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ ప్రయత్నించినా పరిస్థితి విషమించడంతో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా చికిత్స అందించడం సాధ్యం కాదని భావించి, ప్రభుత్వ ఆసుపత్రి నుండి హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. బాబుకు శ్వాస ఇబ్బందితో పాటు ఫిట్స్ కూడా వస్తున్నాయని తెలిపారు.
108 అంబులెన్స్ సేవలు
కామారెడ్డి 108 నియోనాటల్ అంబులెన్స్‌లో బాబును తరలించారు. ఇక్కడి నుండి నీలోఫర్ ఆసుపత్రి వరకు అంబు బ్యాగ్, ఆక్సిజన్ సహాయంతో 3.5 గంటల పాటు నిరంతరాయంగా అంబు బ్యాగ్ అందిస్తూ, ద్రావణాన్ని ఇస్తూ నీలోఫర్‌కు సురక్షితంగా తరలించామని కృష్ణ స్వామి, పైలట్ విజయ్ కుమార్ తెలిపారు.











