ప్రస్తుత కాలంలో స్మార్ట్ఫోన్లు ప్రతి ఒక్కరి జీవితంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే, ఈ సాంకేతికతతో పాటు స్క్రీన్ టైమ్ పెరిగిపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
స్మార్ట్ఫోన్ల అధిక వినియోగం అన్ని వయసుల వారిలోనూ కనిపిస్తోంది. ఉద్యోగులు, విద్యార్థులు, గృహిణులు అనే తేడా లేకుండా అందరూ దీనికి అలవాటు పడుతున్నారు. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఫోన్తోనే గడపడం ఒక సాధారణ విషయంగా మారింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
రోజువారీ పనుల్లో భాగంగా వాట్సాప్, సోషల్ మీడియా, వార్తల అప్డేట్స్ చూడటం చాలామందికి తప్పనిసరైపోయింది. ఆఫీసులో కంప్యూటర్ ముందు పనిచేసినా, ఇంటికొచ్చాక కూడా ఫోన్కు దూరంగా ఉండలేకపోతున్నారు. రాత్రిపూట కూడా రీల్స్, వీడియోలు చూస్తూ నిద్రపోవడం అలవాటుగా మారింది.












