వివరాలను
దేశంలో వాయు కాలుష్యం కారణంగా పెరుగుతున్న శ్వాసకోశ, గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కాలుష్య ప్రభావంతో ఆసుపత్రులకు వస్తున్న రోగుల క్రమబద్ధంగా నమోదు చేసి, ప్రభుత్వ ఆరోగ్య విభాగాలకు నివేదించేలా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ముఖ్యంగా ఢిల్లీ-ఎన్సీఆర్తో పాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత క్షీణిస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాలుష్యం వల్ల ఎంతమంది అనారోగ్యానికి గురవుతున్నారు, ఏ వయసు వారిపై ఎక్కువ ప్రభావం పడుతోంది, ఎలాంటి వ్యాధులు ఎక్కువగా నమోదవుతున్నాయి అనే అంశాలపై స్పష్టమైన సమాచారం సేకరించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.






