కెనడాలో శాశ్వత నివాస హోదా (పీఆర్) పొందాలనుకునే వారికి ప్రభుత్వం కొత్త అవకాశాలను ప్రకటించింది. 2027 నాటికి గరిష్ఠంగా 6.22 లక్షల మందికి పీఆర్ కల్పించే ప్రణాళికను వెల్లడించింది. ఇప్పటికే కెనడాలో నివసిస్తున్న తాత్కాలిక వీసాదారుల్లో 2 లక్షల మందిని పీఆర్‌కు మార్చనుంది.
వీరిలో లక్ష మంది నైపుణ్యం కలిగిన ఉద్యోగులు, మరో లక్ష మంది మానవతా ప్రాతిపదికన అర్హత పొందినవారు ఉంటారు. నైపుణ్య ఉద్యోగులకు ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ, ప్రావిన్షియల్ నామినీ ప్రోగ్రామ్‌ల ద్వారా అవకాశం కల్పించనుంది. మరోవైపు, 2027లో కొత్తగా పీఆర్ పొందేవారి లక్ష్యాన్ని గరిష్ఠంగా 4.22 లక్షలుగా నిర్ణయించారు. 20272029 మధ్య ప్రతి ఏడాది సగటున 3.80 లక్షల మందికి పీఆర్ కల్పించాలని కెనడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త ప్రణాళికలో భాగంగా, ఉద్యోగులు, విద్యార్థుల తాత్కాలిక వీసాల సంఖ్యను ఏడాదికి 3.70 లక్షలకు పరిమితం చేయనుంది. ఈ నిర్ణయం ఇప్పటికే కెనడాలో పనిచేస్తున్న భారతీయులు, ఇతర విదేశీయులకు పీఆర్ పొందేందుకు కొత్త అవకాశాలను అందించనుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి










