మండలం లింగైపల్లి గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న అల్లుడికి దిష్టి తీసి, ఆ దిష్టిని కొట్టాల్పల్లి చెరువులో వేయడానికి వెళ్లిన తండ్రీకూతుళ్లు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందారు. ఈ ఘటనతో రెండు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
లింగైపల్లి గ్రామానికి చెందిన సోమిశెట్టి రజిత భర్త మల్లేశం రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి, అప్పటి నుంచి అనారోగ్యంతో ఇంటి వద్దే ఉంటున్నాడు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మల్లేశం ఆరోగ్యం మెరుగుపడాలని, దిష్టి తీయాలనే ఉద్దేశంతో రజిత తండ్రి, టేక్రియాల్ గ్రామానికి చెందిన పెద్ద నరసయ్య గురువారం లింగైపల్లిలోని తన కూతురు ఇంటికి వచ్చాడు. రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఇంట్లో మల్లేశంకు దిష్టి తీశారు.












