కామారెడ్డి, 8 September
హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి నందు (20) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నిజామాబాద్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దేనిపల్లె ఎస్సై రంజిత్ తెలుపుతూ రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి హైదరాబాద్‌కు చెందిన ఉప్పునూతల నందు (20), తండ్రి దాసు, వృత్తిరీత్యా విద్యార్థి, సోమవారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి బైక్‌పై నిజామాబాద్‌లో జరిగిన ఓ ఫంక్షన్‌కు వెళ్లాడు. అనంతరం తిరిగి హైదరాబాద్‌కు వస్తుండగా మార్గమధ్యంలోని రాయల్ దాబా సమీపంలో గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నందుకు తీవ్ర తలగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మంగళవారం మృతుడి తండ్రి దాసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.










