కామారెడ్డి, 7 September
కామారెడ్డి పట్టణంలో రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పోలీసు శాఖ కీలక ఆంక్షలు విధించింది. ఆగమన్ కార్యక్రమాలకు, డీజే సౌండ్ సిస్టమ్‌ల వినియోగానికి అనుమతి లేదని పట్టణ సీఐ నరహరి స్పష్టం చేశారు. నిర్వాహకులు, ప్రజలు పోలీసు సూచనలను తప్పక పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గణేష్ ఉత్సవాల్లో ఆగమన్, డీజేలకు అనుమతి లేదు: సీఐ నరహరి కామారెడ్డి: రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కామారెడ్డి పట్టణ ప్రజలు, గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు పోలీసు శాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలని పట్టణ సీఐ నరహరి విజ్ఞప్తి చేశారు. వినాయక విగ్రహాలను తీసుకువచ్చే సమయంలో కొత్తగా నిర్వహిస్తున్న "ఆగమన్" కార్యక్రమాలకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. కాబట్టి ఎవరూ ఆ కార్యక్రమాన్ని నిర్వహించరాదని సూచించారు. అదేవిధంగా వినాయక విగ్రహాల ప్రతిష్ఠాపన సమయంలో, ప్రతిష్ఠ అనంతరం, అలాగే నిమజ్జన ఊరేగింపుల్లో డీజే సౌండ్ సిస్టమ్‌ల వినియోగం పూర్తిగా నిషేధించబడిందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ప్రజలు, నిర్వాహకులు పోలీసు శాఖకు సహకరించాలని సీఐ నరహరి కోరారు.












