కామారెడ్డి, 5 September
జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు, విగ్రహాల నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలని అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ ఎన్.వై. గిరి అధికారులను ఆదేశించారు. నుంచి 24 వరకు జరిగే ఉత్సవాలు, 24న జరిగే నిమజ్జనాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు ఏర్పాట్లను పూర్తిచేయాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వినాయక ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు : జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు, విగ్రహాల నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలని అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ ఎన్.వై. గిరి అధికారులను ఆదేశించారు. నుంచి 24 వరకు జరిగే ఉత్సవాలు, 24న జరిగే నిమజ్జనాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు ఏర్పాట్లను పూర్తిచేయాలని సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో నీటి లోతు గుర్తింపు, ఈతగాళ్లు, పడవలు, రక్షణ జాకెట్లు, వైద్య బృందాలు, అంబులెన్స్‌లు, అగ్నిమాపక సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని తెలిపారు. వినాయక మండపాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి, మైక్‌ల వినియోగానికి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని, అనుమతించిన సమయానికి మించి ధ్వని వ్యవస్థలు వినియోగించరాదని స్పష్టం చేశారు. నిమజ్జనం రోజున ట్రాఫిక్, శాంతిభద్రతలపై ప్రత్యేక చర్యలు, నిబంధనల మేరకు మద్యం విక్రయాలపై నిషేధాజ్ఞలు అమలు చేయాలని సూచించారు. పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. ఉత్సవాల సందర్భంగా అత్యవసర సమస్యల కోసం టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసి విస్తృత ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.












