దోమకొండ (డాక్సిన్ టైమ్స్) సెప్టెంబర్ 07
కుటుంబ కలహాల నేపథ్యంలో తన చిన్నారితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ మహిళను, బిడ్డను పోలీసులు సకాలంలో గుర్తించి, వారి ప్రాణాలను కాపాడారు. 112 అత్యవసర నంబర్‌కు అందిన సమాచారంతో వెంటనే స్పందించి, గాలింపు చర్యలు చేపట్టి వారిని సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఒక్క కాల్‌తో తల్లి–బిడ్డ ప్రాణాలు కాపాడిన పోలీసులు కామారెడ్డి జిల్లా మండలంలో కుటుంబ కలహాల కారణంగా తన చిన్నారితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ మహిళ గురించి 112కు సమాచారం అందింది. వెంటనే స్పందించిన పోలీస్ స్టేషన్ పెట్రోకార్ సిబ్బంది పీసీ సాయిబాబా, హెచ్‌జీ రాజు గాలింపు చేపట్టి చెరువు వద్ద మహిళను, చిన్నారిని గుర్తించారు. అనంతరం వారికి కౌన్సెలింగ్ నిర్వహించి, కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, "ఆత్మహత్య ఎప్పటికీ సమస్యలకు పరిష్కారం కాదు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా ఉండి కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా పోలీసులను సంప్రదించాలి" అని సూచించారు. ఒక్క సమాచారం, పోలీసుల సకాల స్పందనతో రెండు ప్రాణాలు సురక్షితంగా నిలిచాయి.












