మాజీ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కుమారులతో ఇంటర్వ్యూ వివాదం నేపథ్యంలో, ప్రముఖ ఇంగ్లాండ్ క్రికెట్ వ్యాఖ్యాతలు మైకేల్ అథర్టన్, నాసర్ హుస్సేన్‌లను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు () రాబోయే వన్డే ట్రై సిరీస్ కామెంటరీ ప్యానెల్ నుంచి తొలగించింది. ఈ నిర్ణయానికి గల కారణాన్ని బోర్డు అధికారికంగా ప్రకటించలేదు.
2023లో ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ మైదానంలో పాకిస్థాన్, ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ వివాదం మొదలైంది. స్కై స్పోర్ట్స్ తరఫున మైకేల్ అథర్టన్, ఇమ్రాన్ ఖాన్ కుమారులు కాసిమ్ ఖాన్, సులేమాన్ ఖాన్‌లను ఇంటర్వ్యూ చేశారు. జైలులో ఉన్న తమ తండ్రి ఆరోగ్యం, భద్రతపై వారు ఆందోళనలు వ్యక్తం చేశారు. తమ తండ్రికి తగిన వైద్యసేవలు అందడం లేదని కూడా ఆరోపించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ ఇంటర్వ్యూలో రాజకీయ అంశాలు ఉన్నాయని భావించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, స్కై స్పోర్ట్స్‌కు ఫిర్యాదు చేసింది. వివాదం ఉన్నప్పటికీ, స్కై స్పోర్ట్స్ సుమారు 18 నిమిషాల ఇంటర్వ్యూను ప్రసారం చేసింది. అయితే, పాకిస్థాన్‌లో ప్రభుత్వ ప్రసార సంస్థ మాత్రం ఆ ఇంటర్వ్యూను ప్రసారం చేయలేదు.











