భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న మూడో వన్డేకు ముందు భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న మూడో వన్డేకు ముందు భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. రాహుల్ ఆటతీరు, ప్రశాంతత, పరిస్థితులకు అనుగుణంగా ఆడే సామర్థ్యాన్ని ఆయన కొనియాడారు. జట్టుకు అవసరమైనప్పుడు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలగడమే కేఎల్ రాహుల్ గొప్పతనమని కోటక్ తెలిపారు. టెస్ట్ క్రికెట్లో ఓపెనర్‌గా, వన్డేల్లో మిడిల్ ఆర్డర్లో, అవసరమైతే ఐదో లేదా ఆరో స్థానంలోనూ అద్భుతంగా ఆడగలడని ఆయన చెప్పారు. నేను రాహుల్‌ను ఎప్పుడూ ఒత్తిడిలో ఉన్నట్లు చూడలేదు. అతను ఎప్పుడూ చాలా ప్రశాంతంగా, స్థిరంగా కనిపిస్తాడు. జట్టును ఎప్పుడూ నిరాశపరచలేదు. అనుభవం, ఆటపై అవగాహన, అద్భుతమైన నైపుణ్యాలు అతని సొంతం అని కోటక్ ప్రశంసించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో కేఎల్ రాహుల్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో అతను 38 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వికెట్లు వరుసగా పడుతున్నప్పటికీ రాహుల్ క్రీజులో నిలబడి జట్టుకు అండగా నిలిచాడు. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత్ 113/7 పరుగులు చేసింది. డక్‌వర్త్ లూయిస్ స్టెర్న్ () పద్ధతిలో భారత్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాహుల్‌ను ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడానికి ప్రధాన కారణాలు లెఫ్ట్-రైట్ కాంబినేషన్, మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లగల అతని సామర్థ్యమని కోటక్ వివరించారు. అక్షర్ పటేల్ కూడా ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన అనుభవం కలిగి ఉన్నాడని ఆయన తెలిపారు.










