భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మధ్య పశ్చిమ ఆసియాలో నెలకొన్న పరిస్థితులపై కీలక చర్చలు జరిగాయి. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాలను పునరుద్ధరించడానికి దౌత్య మార్గాల ఆవశ్యకతను ఇరువురూ నొక్కి చెప్పారు.
ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అందిన సమాచారం ప్రకారం, ప్రధాని మోదీ తన సామాజిక మాధ్యమ ఖాతా ద్వారా ఈ చర్చల వివరాలను వెల్లడించారు. పశ్చిమ ఆసియాలో మారుతున్న పరిణామాలపై ఇరు దేశాలు తమకున్న ఉమ్మడి ఆందోళనలను ఈ సందర్భంగా పంచుకున్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సంభాషణ, దౌత్యం ద్వారానే ఈ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించడం సాధ్యమవుతుందని ఇరువురు నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ దిశగా తమ దేశాలు కలిసికట్టుగా కృషి చేస్తాయని తెలిపారు.











