కామారెడ్డి, జూలై 19
కామారెడ్డి జిల్లాలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ పద్ధతిలో మహిళలు బోనాలు సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. డప్పు చప్పుళ్లు, మంగళ వాయిద్యాల నడుమ భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించారు.
కామారెడ్డి జిల్లాలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ పద్ధతిలో మహిళలు బోనాలు సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, మంగళ వాయిద్యాల నడుమ భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడాయి.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు కనకనాల చంద్రం, బట్టు రవి, రాములు, నర్సింలు, హరీష్, శంకర్, శ్రీనివాస్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ ఐక్యతతో ఈ వేడుకలను నిర్వహించడం అభినందనీయమన్నారు.
అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు.











