తమిళనాడులోని రామేశ్వరం ప్రాంతానికి చెందిన ఏడుగురు భారతీయ మత్స్యకారులను శ్రీలంక నేవీ ఆదివారం తెల్లవారుజామున అరెస్ట్ చేసింది. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ () దాటి శ్రీలంక జలాల్లో చేపల వేట సాగించారనే ఆరోపణలతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి యాంత్రిక పడవను కూడా స్వాధీనం చేసుకున్నారు.
అధికారుల వివరాల ప్రకారం, రామేశ్వరం ఫిషింగ్ హార్బర్ నుంచి సుమారు 398 యాంత్రిక పడవలు చేపల వేటకు వెళ్లాయి. వాటిలో ఒక పడవను శ్రీలంక నేవీ ఉత్తర మన్నార్ సముద్ర జలాల్లో అడ్డుకుంది. ఆ పడవలోని ఏడుగురు మత్స్యకారులను అరెస్ట్ చేసి, పడవను స్వాధీనం చేసుకుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అనంతరం వారిని మన్నార్ నేవీ క్యాంప్‌కు తరలించినట్లు సమాచారం. తదుపరి చట్టపరమైన చర్యల కోసం వారిని మత్స్యశాఖ అధికారులకు అప్పగించనున్నారు. అరెస్ట్ అయిన ఏడుగురిని అధికారులు గుర్తించారు. వారి పేర్లు: ఎస్. ప్లాసియస్ (41), ఎస్. అళగు పాండి (22), ఏ. ఆంటోనీ పిచ్చై (33), జె. రబీన్ (21), ఏ. నెల్సన్ (58), ఆర్. అరుళానంద జేవియర్ (65), ఏ. సహాయ ఆనంద్ (34).





