కామారెడ్డి పట్టణంలోని కల్కి నగర్ మూడవ వీధిలో ఆడపడుచులు బతుకమ్మ సంబరాలను ఉత్సాహంగా జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు. మహిళలంతా ఒకచోట చేరి ఆనందోత్సాహాల మధ్య వేడుకల్లో పాల్గొన్నారు. పండుగ వాతావరణంతో మూడవ వీధి సందడిగా మారింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తెలంగాణ ఆడపడుచుల ఐక్యతకు, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.











