ఆగ్రా, 26 మార్చి 2026
పోలీసుల నిర్లక్ష్యపూరిత దర్యాప్తు కారణంగా ఆరేళ్లు జైలు జీవితం గడిపిన ఓ వ్యక్తి చివరకు నిర్దోషిగా విడుదలయ్యాడు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. బాధితుడికి రూ.6 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నిర్ణీత నెల రోజుల్లోగా పరిహారం చెల్లించకపోతే, ఆ మొత్తంపై ఏడాదికి 18 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆగ్రా జిల్లా పరిధిలో 2019లో నమోదైన కిడ్నాప్, హత్య కేసులో అరుణ్ అలియాస్ దీపక్ అనే వ్యక్తిని పోలీసులు నిందితుడిగా చేర్చారు. అతడిని 2014 నుంచి జైలులో ఉంచారు.












