దీపావళి పండుగ నేపథ్యంలో బాణసంచా కాల్చే విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీతో పాటు జాతీయ రాజధాని ప్రాంతం (ఢిల్లీఎన్సీఆర్) పరిధిలో పరిమిత సమయాల్లో గ్రీన్ క్రాకర్స్ కాల్చడానికి అనుమతించింది. పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్యం, పండుగ సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే బాణసంచా వినియోగంపై కఠినమైన నిబంధనలు విధించింది. నవంబర్ 7, 8 తేదీల్లో మాత్రమే గ్రీన్ క్రాకర్స్ కాల్చడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణసంచా కాల్చాలని స్పష్టం చేసింది. ఈ సమయాలు మినహా మిగిలిన సమయంలో బాణసంచా కాల్చడానికి అనుమతి ఉండదు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆసుపత్రుల సమీపంలో బాణసంచా వినియోగంపై నిషేధం విధించింది. ఈ ప్రాంతంలో మళ్లీ పూర్తిస్థాయి నిషేధం అమల్లోకి రానుంది. సాధారణ బాణసంచాతో పోలిస్తే తక్కువ కాలుష్యాన్ని విడుదల చేసేలా రూపొందించిన గ్రీన్ క్రాకర్స్‌కు మాత్రమే అనుమతి ఉంటుంది.






