ఆంధ్రప్రదేశ్‌లో
మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (), జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల () ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. పలు ప్రాంతాల్లో ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ ఎన్నికల్లో మొత్తం 2,61,52,377 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1.32 కోట్ల మంది మహిళలు, 1.28 కోట్ల మంది పురుషులు, 1,282 మంది ఇతర కేటగిరీ ఓటర్లు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 582 స్థానాలకు, 7,767 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. స్థానాల్లో 2,169 మంది, స్థానాల్లో 18,843 మంది కలిపి మొత్తం 21,012 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇప్పటికే 77 , 2,051 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో మూడు స్థానాల్లో ఎన్నికలు జరగడం లేదు.
ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 31,460 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 8,904 కేంద్రాలను సున్నితమైనవిగా, 7,160 కేంద్రాలను అత్యంత సున్నితమైనవిగా గుర్తించారు. సుమారు 40 వేల మంది పోలీసు సిబ్బందిని భద్రత కోసం నియమించారు. పలు కేంద్రాల్లో సీసీటీవీ, వెబ్‌కాస్టింగ్, వీడియో చిత్రీకరణ ద్వారా పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. మురాసు తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లోని కొన్ని మండలాలు, పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలను వాయిదా వేశారు. ఆయా ప్రాంతాల్లో నూతన తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు.

