బేగంబజార్ ఫిష్ మార్కెట్ సమీపంలోని చేపల గోదాంలో అక్రమ జూదం ఆడుతున్న 16 మందిని గోషామహల్ పోలీసులు అరెస్టు చేశారు.
ఒక తేదీ తెల్లవారుజామున ఈ దాడి జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. బేగంబజార్ ఫిష్ మార్కెట్ సమీపంలోని ధనలక్ష్మి ఫిష్ గోదాంలో రెండు గదుల్లో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో తెల్లవారుజామున సుమారు 12:20 గంటలకు పోలీసులు అక్కడ తనిఖీలు నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా కొందరు అందర్ బహార్, తీన్‌పత్తి వంటి జూద క్రీడలు ఆడుతున్నట్లు గుర్తించారు. దాడిలో పోలీసులకు రూ.23,800 నగదు, మూడు పేకాట సెట్లు, నాలుగు మొబైల్ ఫోన్లు లభించాయి. పట్టుబడిన 16 మందిని అదుపులోకి తీసుకున్నారు.





