మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ నగరంలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గాజీనగర్ ప్రాంతంలోని మురికివాడలో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో అనేక గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి.
పలు కుటుంబాలు తమ ఇళ్లు, ఇంట్లోని వస్తువులను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. గోహల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లేమా గార్డెన్ సమీపంలో తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లు, నీటి ట్యాంకర్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భారీ ఆస్తి నష్టం అంచనా
మంటలు వేగంగా వ్యాపించడంతో గుడిసెల్లోని బట్టలు, ఆహార పదార్థాలు, గృహోపకరణాలు సహా అనేక వస్తువులు కాలిపోయాయి. కొన్ని స్థానిక మీడియా కథనాల ప్రకారం 50కి పైగా గుడిసెలు దెబ్బతిన్నట్లు అంచనా వేస్తున్నారు. మరో నివేదికలో 15 గుడిసెలు పూర్తిగా కాలిపోయినట్లు పేర్కొన్నారు. నష్టం ఎంత జరిగిందనే దానిపై అధికారికంగా తుది అంచనా ఇంకా వెలువడాల్సి ఉంది.











