భారత వైమానిక దళం () మరో అరుదైన ఘనత సాధించింది. రష్యా తయారీ భారీ రవాణా విమానం -76 గజరాజ్‌ను తూర్పు లడఖ్‌లోని న్యోమా ఎయిర్‌ఫీల్డ్‌లో విజయవంతంగా ల్యాండ్ చేసింది. సముద్ర మట్టానికి 13,629 అడుగుల ఎత్తులో ఈ ల్యాండింగ్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా -76 విమానానికి ఇదే అత్యంత ఎత్తులో జరిగిన ల్యాండింగ్ అని వైమానిక దళం వెల్లడించింది.
భారత వైమానిక దళం () మరో అరుదైన ఘనత సాధించింది. రష్యా తయారీ భారీ రవాణా విమానం -76 గజరాజ్‌ను తూర్పు లడఖ్‌లోని న్యోమా ఎయిర్‌ఫీల్డ్‌లో విజయవంతంగా ల్యాండ్ చేసింది. సముద్ర మట్టానికి 13,629 అడుగుల ఎత్తులో ఈ ల్యాండింగ్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా -76 విమానానికి ఇదే అత్యంత ఎత్తులో జరిగిన ల్యాండింగ్ అని వైమానిక దళం వెల్లడించింది. ఎత్తైన పర్వత ప్రాంతాల్లో గాలి సాంద్రత తక్కువగా ఉంటుంది. దీంతో విమానానికి అవసరమైన లిఫ్ట్ లభించడం, ఇంజిన్ల పనితీరు, టేకాఫ్-ల్యాండింగ్ ప్రక్రియలు మరింత క్లిష్టంగా మారుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారీ రవాణా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడం పైలట్ల నైపుణ్యానికి, సాంకేతిక సామర్థ్యానికి పరీక్షగా నిలుస్తుంది. తూర్పు లడఖ్‌లోని న్యోమా ప్రాంతం వాస్తవాధీన రేఖ ()కు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఈ ప్రాంతంలో భారీ రవాణా విమానాల కార్యకలాపాలు నిర్వహించగలగడం భారత సైనిక సామర్థ్యానికి ప్రాధాన్యతను చేకూరుస్తుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
-76 నాలుగు ఇంజిన్లు కలిగిన భారీ రవాణా విమానం. సైనికులు, వాహనాలు, ఆయుధ సామగ్రి, ఇతర అవసరమైన సరుకులను దూర ప్రాంతాలకు తరలించడానికి దీనిని ఉపయోగిస్తారు. భారత వైమానిక దళంలో 1985 నుంచి సేవలందిస్తున్న ఈ విమానం, కఠినమైన భౌగోళిక పరిస్థితుల్లో సైనిక లాజిస్టిక్స్‌కు కీలకంగా ఉంది. ఈ విజయాన్ని భారత వైమానిక దళం తన వ్యూహాత్మక వైమానిక రవాణా సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే మైలురాయిగా అభివర్ణించింది. విమాన సిబ్బంది నైపుణ్యం, కచ్చితత్వం, వృత్తిపరమైన సామర్థ్యాన్ని ప్రశంసించింది.





