దేశంలోని న్యాయవ్యవస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుప్రీంకోర్టు కొలీజియం నాలుగు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులుగా నలుగురు న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేసింది. అదే సమయంలో మధ్యప్రదేశ్, బాంబే హైకోర్టుల్లో మరో తొమ్మిది మంది న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదించింది.
ఈ నిర్ణయాలు ఇటీవల జరిగిన కొలీజియం సమావేశంలో తీసుకున్నారు. కొలీజియం సిఫార్సుల ప్రకారం ప్రధాన న్యాయమూర్తులుగా నియమించేందుకు ప్రతిపాదించిన పేర్లు ఇవి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రధాన న్యాయమూర్తుల సిఫార్సులు
జస్టిస్ మనాష్ రంజన్ పాఠక్ (గుజరాత్ హైకోర్టు), జస్టిస్ పి. సామ కోషి (ఢిల్లీ హైకోర్టు), జస్టిస్ తపబ్రత చక్రవర్తి (తెలంగాణ హైకోర్టు), జస్టిస్ సుధీర్ సింగ్ (ఉత్తరాఖండ్ హైకోర్టు) పేర్లను ప్రధాన న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుతం గుజరాత్ హైకోర్టులో పనిచేస్తున్న జస్టిస్ పాఠక్‌ను అదే హైకోర్టు సీజేగా, తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్న జస్టిస్ కోషిని ఢిల్లీ హైకోర్టు సీజేగా, కలకత్తా హైకోర్టులో పనిచేస్తున్న జస్టిస్ చక్రవర్తిని తెలంగాణ హైకోర్టు సీజేగా, పాట్నా హైకోర్టులో పనిచేస్తున్న జస్టిస్ సింగ్‌ను ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా నియమించాలని ప్రతిపాదించారు.






