ఢిల్లీలో నిరసనల సందర్భంగా అదుపులోకి తీసుకున్న వారికి వేడి, తాజాగా తయారు చేసిన మంచి భోజనం అందించామని ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు. నిరసనకారులను జైళ్లలో ఉంచలేదని, తాత్కాలిక కేంద్రాలకు తరలించామని, పరిస్థితి చక్కబడిన తర్వాత వారిని విడిచిపెట్టామని పోలీసు కమిషనర్ అనురాగ్ కుమార్ వివరించారు.
తమ అదుపులో ఉన్నవారు సాధారణంగా రెండు నుంచి ఆరు గంటల వ్యవధిలో విడుదలయ్యారని తెలిపారు. రాత్రి 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రైసినా హిల్స్ చుట్టూ నాలుగు కిలోమీటర్ల పరిధిలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను మాత్రమే నిలిపివేసినట్లు పోలీసు కమిషనర్ తెలిపారు. వై-ఫై, బ్రాడ్బ్యాండ్ సేవలను నిలిపివేయలేదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం
నిరసనల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. గత నిరసనల్లో హింస, ఆస్తుల ధ్వంసం, పోలీసులకు గాయాలైన ఘటనలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. జరిగిన నిరసనల వల్ల మధ్య ఢిల్లీలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగిందని కూడా అఫిడవిట్లో వివరించారు.












