కేరళ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత పినరయి విజయన్, ఆయన కుమార్తె వీణా టీ, అల్లుడు పి.ఏ. మహమ్మద్ రియాస్‌కు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్)ఎక్సాలోజిక్ సంస్థల మధ్య జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చెల్లింపుల వ్యవహారంలో నమోదైన ఎఫ్ఐఆర్పై తదుపరి దర్యాప్తును వారం రోజులపాటు నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
ఈ వ్యవధిలో కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించి తమ వాదనలు వినిపించేందుకు వారికి అవకాశం కల్పించింది. జస్టిస్ జాయ్మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనతో కూడిన ధర్మాసనం దర్యాప్తును మాత్రమే తాత్కాలికంగా నిలిపివేసింది. ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయలేదు. న నమోదైన ఎఫ్ఐఆర్ కొనసాగుతుందని, అయితే తదుపరి దర్యాప్తు మాత్రం వారం రోజులపాటు చేపట్టరాదని స్పష్టం చేసింది. కేసులోని ఆరోపణలపై తుది అభిప్రాయాన్ని వెల్లడించడం లేదని కూడా న్యాయస్థానం పేర్కొంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కేసు నేపథ్యం
2017 నుంచి 2020 మధ్య సీఎంఆర్ఎల్ సంస్థ, వీణా టీకి మరియు ఆమెకు చెందిన ఎక్సాలోజిక్ సొల్యూషన్స్ సంస్థకు చెల్లింపులు చేసిందన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఈ చెల్లింపులు అందించిన సేవలకు ప్రతిఫలం కాకుండా, పినరయి విజయన్‌కు ముడుపులుగా చెల్లించారనే అనుమానాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వ్యక్తం చేసింది. ఈడీ నివేదిక ప్రకారం, సంబంధిత కాలంలో వీణా, ఆమె సంస్థకు మొత్తం రూ.3.28 కోట్లు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి.












