హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందిన వారికి మాత్రమే షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) హోదా వర్తిస్తుందని, ఇతర మతాల్లోకి మారితే ఆ హోదా కోల్పోతారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది.
క్రైస్తవం వంటి ఇతర మతాలలోకి మారినప్పుడు, ఎస్సీ హోదా పూర్తిగా కోల్పోతారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఒక వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారి, ఆ విశ్వాసాన్ని ఆచరిస్తుంటే, వారిని షెడ్యూల్డ్ కుల సభ్యులుగా పరిగణించలేమని న్యాయమూర్తులు పి.కె. మిశ్రా, మన్మోహన్ లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ తీర్పు ఎస్సీల రిజర్వేషన్లకు సంబంధించిన కీలక అంశాలను తెలియజేస్తుంది.











