రాజంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఆదరణ పెరుగుతోంది. స్థానిక జనసేన ఇన్చార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీతో పాటు ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో జనసేన పార్టీలో చేరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీని బలోపేతం చేసే దిశగా ఈ చేరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
రాజంపేట పట్టణంలోని సాతుపల్లి ప్రాంతానికి చెందిన రేవూరి చిన్నా, రేవూరి మణి ఆధ్వర్యంలో పలువురు వైఎస్సార్సీపీ మరియు ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జనసైనికులు భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. సాతుపల్లిలో గ్రామస్తులు, మహిళలు యల్లటూరు శ్రీనివాసరాజుకు ఘన స్వాగతం పలికారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై...











