మదనపల్లెలో రక్తదానం చేయడం ద్వారా ఎందరో ప్రాణాలను కాపాడవచ్చని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణార్థం నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆయన స్వయంగా రక్తదానం చేసి సిబ్బందిలో స్ఫూర్తి నింపారు.
ఆపదలో ఉన్నవారికి రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడటమే అమరవీరులకు అర్పించే నిజమైన నివాళి అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. రక్తదానం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని లేదని, పైగా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.












