నగర శివారులోని వైఎస్ఆర్ నగర్ లో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. వరుస దొంగతనాలతో కాలనీ వాసులు భయాందోళన చెందుతున్నారు. తాజాగా ఒక అంగడిలో చొరబడి నగదు, సరుకులను అపహరించారు.
నగర శివారులోని వైఎస్ఆర్ నగర్ లో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. వరుస దొంగతనాలతో కాలనీ వాసులు భయాందోళన చెందుతున్నారు. తాజాగా వైఎస్ఆర్ నగర్ లో సోమిశెట్టి సుధాకర్ అనే వ్యక్తికి చెందిన అంగడిలో దొంగలు చొరబడి చోరీకి పాల్పడ్డారు. అంగడిలో ఉన్న 10 వేల రూపాయల నగదుతో పాటు, సుమారు 30 వేల విలువైన సరుకులను దొంగలు అపహరించారు. ఉదయం అంగడి తెరిచేందుకు వచ్చిన యజమాని చోరీని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అయితే ఇది ఒక్కటే ఘటన కాదు. వైఎస్ఆర్ కాలనీలో ఇప్పటి వరకు సుమారు 10 దొంగతనాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా రాత్రి వేళల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్లు, దుకాణాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నారు.












