వై.ఎస్.ఆర్ కడప, 2025-01-25
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో అద్భుత విజయాన్ని అందుకుంది. -18 రాకెట్ ద్వారా -03 నావిగేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించారు. శుక్రవారం రాత్రి శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భారత అంతరిక్ష చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. -18 ప్రయోగం విజయవంతమైంది.
శుక్రవారం రాత్రి 11:51 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం రెండో ప్రయోగ వేదిక నుంచి -18 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. 2,232 కిలోల బరువున్న -03 నావిగేషన్ ఉపగ్రహాన్ని నిర్దేశిత జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ ఉపగ్రహం భారత స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ లో భాగంగా పనిచేయనుంది. దేశ భూభాగంతో పాటు సుమారు 1,500 కిలోమీటర్ల పరిధిలో స్థాన నిర్ధారణ, నావిగేషన్, సమయ సేవలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

