స్మార్ట్‌ఫోన్ ప్రియులకు వివో మరో కొత్త ఫోన్‌ను పరిచయం చేయనుంది. వివో ఎస్2 ఎఫ్ఈ స్మార్ట్‌ఫోన్‌ను డాక్సిన్ టైమ్స్ లో భారత్‌లో విడుదల చేయనుంది. మధ్యస్థాయి ధరల విభాగంలో రానున్న ఈ ఫోన్లో భారీ బ్యాటరీ, అమోలెడ్ డిస్ప్లే వంటి ప్రత్యేకతలు ఉండనున్నాయి.
వివో ఎస్2 ఎఫ్ఈలో 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండొచ్చని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇది 44 వాట్ల వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. అయితే, బ్యాటరీ సామర్థ్యాన్ని కంపెనీ పూర్తిగా వెల్లడించలేదు. కంపెనీ మాత్రం ఇప్పటివరకు తన స్మార్ట్‌ఫోన్ శ్రేణిలోనే అతిపెద్ద బ్యాటరీని ఈ ఫోన్లో అందించనున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
డిస్ప్లే వివరాలు
ఈ ఫోన్లో 6.83 అంగుళాల 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. అధిక రిఫ్రెష్ రేట్ కారణంగా స్క్రోలింగ్, వీడియోలు, గేమింగ్ సమయంలో మరింత స్మూత్ అనుభవం లభించే అవకాశం ఉంది. డిస్ప్లే గరిష్ఠంగా 2,000 నిట్స్ వరకు ప్రకాశాన్ని అందించవచ్చని లీక్‌లలో పేర్కొన్నారు.











