జూబ్లీహిల్స్‌లో ఏపీ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యకు ఘరానా మోసం ఎదురైంది. తమది కాని భూమిని తమదేనని నమ్మించి, నకిలీ పత్రాలు సృష్టించి రూ.25 లక్షలు కాజేసిన ఘటన వెలుగు చూసింది. ఈ ఘటనపై బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటున్న ఏపీ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యను పేరూరు తులసిగోపాల్, అతని కుమారుడు గిరిధర్ అనే వ్యక్తులు మోసం చేశారు. హైదరాబాద్ మాదాపూర్ 100 ఫీట్ రోడ్డులో తమకు 5.5 ఎకరాల భూమి ఉందని, దానిని తక్కువ ధరకే అమ్ముతున్నామని చెప్పి రామచంద్రయ్యను నమ్మించారు. వారి మాటలు నమ్మిన ఎమ్మెల్సీ భూమి కొనుగోలుకు అంగీకరించి, అడ్వాన్స్‌గా రూ.25 లక్షలు ఇచ్చారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అయితే ఒప్పందం తర్వాత ఆ భూమికి సంబంధించిన ఒరిజినల్ పత్రాలు చూపించాలని రామచంద్రయ్య కోరగా, తులసిగోపాల్, గిరిధర్ తప్పించుకుని తిరగడం ప్రారంభించారు. దీంతో అనుమానం వచ్చిన ఎమ్మెల్సీ ఆ భూమి వివరాలపై ఆరా తీయగా, అసలు ఆ భూమి తులసిగోపాల్ది కాదని, తమది కాని భూమిని చూపించి మోసం చేశారని తేలింది.












