*కామారెడ్డి (డాక్సిన్ టైమ్స్) అక్టోబర్ 24
కామారెడ్డి జిల్లా కేంద్రంలో పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం జిల్లా చరిత్రలో మొట్టమొదటిసారిగా 435 యూనిట్ల రక్తాన్ని సేకరించి చరిత్ర సృష్టించింది. తలసేమియా బాధిత చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు పోలీసు శాఖ చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కామారెడ్డి జిల్లా కేంద్రంలో పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం జిల్లా చరిత్రలో మొట్టమొదటిసారిగా 435 యూనిట్ల రక్తాన్ని సేకరించింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రకు తలసేమియా సికిల్ సెల్ పురస్కారాన్ని అందజేసినట్లు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయ సభ్యులు డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు ఎండి జమీల్ అమ్మద్ లు తెలిపారు.












