కడప జిల్లాలో వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, శుక్రవారం (30వ తేదీ) సాయంత్రం 5 గంటల నుంచి సైలెన్స్ పీరియడ్ అమలులోకి వస్తుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఈ సమయంలో ఎన్నికల ప్రచారం, మద్యం విక్రయాలపై ఆంక్షలు ఉంటాయని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
జిల్లాలో వ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో, శుక్రవారం (30వ తేదీ) సాయంత్రం 5 గంటల నుండి సైలెన్స్ పీరియడ్ (నిశ్శబ్ద కాలం) అమలులోకి తీసుకురావడం జరుగుతుందని, ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమ నిబంధనలను తప్పనిసరిగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు, పోలింగ్ ముగింపు సమయానికి 48 గంటల ముందు నుంచే సైలెన్స్ పీరియడ్ అమల్లోకి వస్తుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సైలెన్స్ పీరియడ్ లో ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా , అందుకు ఎన్నికల సంబంధిత అధికారులు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వ తేదీన నిర్వహించనున్న నేపథ్యంలో, అక్టోబరు 30వ తేదీ సాయంత్రం నుంచి ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు నిలిపివేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నిశ్శబ్ద కాలంలో బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ఇంటింటి ప్రచారాలు, ఇతర ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని ఆయన అన్నారు. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఎలాంటి ప్రచార చర్యలకు పాల్పడకూడదని ఆయన సూచించారు. పోలింగ్ జరిగే మున్సిపల్ ప్రాంతాల్లో ఓటర్లు కాని బయటి వ్యక్తులు ఉండరాదని, స్థానికేతరులు ఆయా ప్రాంతాలలో ఉండకూడదని ఆయన అన్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధం లేని వ్యక్తులు పోలింగ్ జరిగే ప్రాంతాల్లో సంచరించకుండా సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేపట్టాలని ఆయన ఆదేశించారు.
అలాగే, పోలింగ్ ముగింపు సమయానికి 48 గంటల ముందు నుంచే మద్యం దుకాణాలు, మద్యం విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ నిబంధనలను అన్ని సంబంధిత దుకాణాల యజమానులు తప్పనిసరిగా , అక్రమంగా మద్యం విక్రయించినా, పంపిణీ చేసినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఓటర్లకు నగదు, మద్యం, ఇతర వస్తువుల పంపిణీ వంటి ప్రలోభాలకు పాల్పడరాదని, ఎన్నికల ప్రశాంతతకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆయన అన్నారు. నిబంధనల అమలుపై పోలీసు, ఎన్నికల అధికారులు నిరంతరం నిఘా ఉంచాలని ఆయన సూచించారు.





