నెల్లూరు గ్రామీణం, 2026-07-11
చిత్తూరు జిల్లాలో అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. పెనుమూరు, జి.డి. నెల్లూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన మూడు కేసులను ఛేదించి, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.9 లక్షల విలువైన 64 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
చిత్తూరు జిల్లా పోలీసు శాఖ నేరాల నియంత్రణ, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. జిల్లాలోని పెనుమూరు, జి.డి. నెల్లూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన మూడు చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించి, అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠాకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, సుమారు రూ.9 లక్షల విలువైన 64 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.












