భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాజంపేట నియోజకవర్గంలో ఆశీర్వాద్ కా దీయా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాజంపేట పట్టణంలోని టీడీపీ నియోజకవర్గ పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
దేశ ప్రగతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రధాన మంత్రి మోదీకి గౌరవ సూచికగా, ఆయనకు ఆశీస్సులు, మద్దతు తెలియజేసేందుకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద దీపాలు వెలిగించాలని ఈ సందర్భంగా చమర్తి జగన్ మోహన్ రాజు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రధాన మంత్రి మోదీ ప్రజాసేవకు నిదర్శనంగా చేపట్టిన ఈ దీపోత్సవంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.











