జిల్లా కేంద్రంలోని న్యూ బస్టాండ్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్లే అశోక్ నగర్ కాలనీ మెయిన్ రోడ్డు మరమ్మత్తులు తక్షణమే చేపట్టాలని జనసేన నాయకులు జాజారి దినేష్ కుమార్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ రహదారి ప్రజలు నడవలేని పరిస్థితిలో ఉందని వారు పేర్కొన్నారు.
జిల్లా కేంద్రంలోని న్యూ బస్టాండ్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్లే అశోక్ నగర్ కాలనీ మెయిన్ రోడ్డు మరమ్మత్తులు తక్షణమే చేపట్టాలని జనసేన నాయకులు జాజారి దినేష్ కుమార్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ, న్యూ బస్టాండ్ ప్రాంతం నుండి కలెక్టర్ ఆఫీస్ మరియు ఎస్పీ ఆఫీస్ రోడ్డుకు కొన్ని వేల మంది ఉద్యోగులు, ప్రజలు నిత్యం ప్రయాణిస్తుంటారు. అలాంటి రహదారి ప్రజలు నడవలేని పరిస్థితిలో ఉందని, ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా రోడ్లు బాగు చేయలేని పరిస్థితి జిల్లా కేంద్రంలో నెలకొందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దినేష్ కుమార్, అరవింద్ పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి





