కడప నగరంలో మెగా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించబడింది. అమీన్ పీర్ దర్గా ఎదురుగా ఉన్న అమీన్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కడప శాసనసభ్యురాలు, ప్రభుత్వ విప్ శ్రీమతి రెడ్డెప్పగారి మాధవి రెడ్డి ఆదేశాల మేరకు ఈ శిబిరం ఏర్పాటు చేయబడింది.
టీడీపీ కడప నగర అధ్యక్షులు లయన్ పి. మన్సూర్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వైద్య శిబిరంలో, 30 సంవత్సరాల అనుభవం కలిగిన నిష్ణాతులైన ప్రభుత్వ ఆయుర్వేద వైద్యులు ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులను కూడా పంపిణీ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత












