రాజంపేట మున్సిపల్ చైర్మన్ పదవి కోసం ఆశావహుల హడావుడి మొదలైంది. ఎన్నికల వాతావరణం కనిపించగానే నాయకులు ప్రజల మధ్యకు వెళ్లి హామీలు ఇవ్వడం, చిన్నచిన్న పంపిణీలు చేయడం జోరందుకుంది. అయితే, ఎన్నికల ముందు మాత్రమే ప్రజలకు నాయకులు గుర్తుకు వస్తారా అనే ప్రశ్న ప్రజల నుంచి వినిపిస్తోంది.
రాజంపేట మున్సిపల్ చైర్మన్ పదవి కోసం ఆశావహుల హడావుడి మొదలైంది. ఎన్నికల వాతావరణం కనిపించగానే స్కూళ్లు, మార్కెట్లు, బస్టాండ్లు, గ్రామాలు అంటూ ప్రజల మధ్యకు వెళ్లడం, హామీలు ఇవ్వడం, చిన్నచిన్న పంపిణీలు చేయడం జోరందుకుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కానీ ప్రజల్లో మాత్రం ఒకే ప్రశ్న వినిపిస్తోంది. ఎన్నికల ముందు మాత్రమే ప్రజలకు నాయకులు గుర్తుకు వస్తారా ఇన్ని రోజులు తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, వీధిలైట్ల సమస్యలపై ప్రజలను ఎంతమంది నేరుగా కలిసి అడిగారు మీ సమస్య ఏంటి అని ఎంతమంది ప్రజల వద్దకు వెళ్లారు











