బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా () తన కస్టమర్లకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఈ నెల 29, 30 తేదీల్లో ఏటీఎం లావాదేవీలపై వర్తించే ఛార్జీలను మినహాయిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ నెల 28 నుంచి 30 వరకు బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బీఐ, తమ కస్టమర్లకు కీలక ప్రకటన చేసింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
బ్యాంకు సమ్మె కారణంగా శాఖల సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున, కస్టమర్లకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 29, 30 తేదీల్లో జరిగే ఏటీఎం లావాదేవీలపై వర్తించే ఛార్జీలను మినహాయిస్తున్నట్లు ప్రకటించింది.












