కడప జిల్లా కోర్టు ప్రాంగణంలో హైకోర్టు గౌరవ న్యాయమూర్తులతో కాన్ఫరెన్స్ మరియు వర్క్‌షాప్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేసుల నిర్వహణ, సత్వర పరిష్కారంపై న్యాయమూర్తులు పలు సూచనలు, మార్గదర్శకాలు అందించారు.
కడప జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా సదన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గౌరవ న్యాయమూర్తి మరియు కడప జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ తార్లాడ రాజశేఖర్‌రావు చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గౌరవ న్యాయమూర్తి జస్టిస్ బాలాజీ మెడమల్లి గౌరవ అతిథిగా హాజరయ్యారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి రామ గోపాల్ వారికి సాదర స్వాగతం పలికారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ వర్క్‌షాప్‌లో రిసోర్స్ పర్సన్లుగా విశ్రాంత జిల్లా న్యాయమూర్తులు బి. సత్యనారాయణ మరియు జి. అన్వర్ బాషా పాల్గొన్నారు. కడప జిల్లాలోని అన్ని న్యాయస్థానాలకు చెందిన న్యాయాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












