కామారెడ్డి, జూలై 24
సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్లూర్–ఎల్లారెడ్డి బ్రిడ్జిపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న ఓ వ్యక్తిని కానిస్టేబుల్ అజర్ తన సమయస్ఫూర్తితో రక్షించి మానవత్వాన్ని చాటారు. వ్యక్తిగత, కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురైన అతన్ని పోలీసులు కౌన్సెలింగ్ అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్లూర్–ఎల్లారెడ్డి బ్రిడ్జిపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న ఓ వ్యక్తిని కానిస్టేబుల్ అజర్ సమయస్ఫూర్తితో రక్షించి మానవత్వాన్ని చాటారు. విధుల్లో భాగంగా గస్తీ నిర్వహిస్తున్న సమయంలో బ్రిడ్జిపై అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని గమనించిన కానిస్టేబుల్ అజర్ వెంటనే అప్రమత్తమై అతడిని సురక్షితంగా అదుపులోకి తీసుకుని ప్రమాదం నుంచి కాపాడారు.
అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించి అతనికి కౌన్సెలింగ్ నిర్వహించారు. వ్యక్తిగత, కుటుంబ సమస్యల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పోలీసులు కుటుంబ సభ్యులను పిలిపించి వారికి పరిస్థితిని వివరించి, బాధితుడిని వారి సంరక్షణలో అప్పగించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ మాట్లాడుతూ, "జీవితం అమూల్యమైనది. ఎలాంటి సమస్యకైనా ఆత్మహత్య పరిష్కారం కాదు. కష్టాలు తాత్కాలికం, కానీ జీవితం ఎంతో విలువైనది. సమస్యలు ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా పోలీసులను సంప్రదించి సహాయం పొందాలి" అని సూచించారు.











