లక్ష్యంగా (డాక్సిన్ టైమ్స్) సెప్టెంబర్ 03
జుక్కల్ పట్టణంలో ఆహార భద్రతాధికారి విక్రమ్ ఆధ్వర్యంలో గురువారం పలు ఆహార వ్యాపార సంస్థల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ లేకుండా వ్యాపారాలు నిర్వహించడం, లేబుల్ నిబంధనలు పాటించకపోవడం వంటి అంశాలపై అధికారులు దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జుక్కల్‌లో ఆహార వ్యాపార సంస్థలపై తనిఖీలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: ఆహార భద్రతాధికారి విక్రమ్ జుక్కల్, సెప్టెంబర్ 3: జుక్కల్ పట్టణంలో ఆహార భద్రతాధికారి విక్రమ్ ఆధ్వర్యంలో గురువారం కిరాణా దుకాణాలు, డిస్ట్రిబ్యూషన్ షాపులు, బేకరీలు, స్వీట్ షాపుల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆహార వ్యాపార సంస్థలు ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అలాగే కొన్ని ఆహార ఉత్పత్తులపై లేబుల్ నిబంధనలు పాటించకపోవడం, తయారీ తేదీ, ఎఫ్ఎస్ఎస్ఏఐ నంబర్ తదితర వివరాలు లేకపోవడాన్ని గుర్తించి సంబంధిత వ్యాపారులకు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. బేకరీల్లో అపరిశుభ్ర వాతావరణం ఉన్నట్లు గుర్తించిన అధికారులు సంబంధిత నిర్వాహకులకు మెరుగుదల నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆహార భద్రతాధికారి విక్రమ్ మాట్లాడుతూ, అన్ని ఆహార వ్యాపార సంస్థలు తప్పనిసరిగా ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ పొందాలని, ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయ సమయంలో పరిశుభ్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై తయారీ తేదీ, గడువు తేదీ, ఎఫ్ఎస్ఎస్ఏఐ నంబర్ వంటి తప్పనిసరి వివరాలు స్పష్టంగా ఉండేలా చూడాలని తెలిపారు. ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందించడమే జిల్లాలో తనిఖీలు నిరంతరం కొనసాగుతున్నాయని, నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని విక్రమ్ హెచ్చరించారు. రానున్న రోజుల్లో తనిఖీలను మరింత ముమ్మరం చేయనున్నట్లు తెలిపారు. అధికారులు సూచించిన నిబంధనలు పాటిస్తూ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చి ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలని వ్యాపారులకు సూచించారు.












